సందీప్ రెడ్డి వంగా సినిమాలంటే ఏ లెవెల్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.ఓ అర్జున్ రెడ్డి,అనిమల్ సినిమాలు యూత్ ని ఎంతలా అట్రాక్ట్ చేశాయో చెప్పనక్కర్లేదు.అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ దాస్ పేరుతో తీసి అక్కడ కూడా హిట్ కొట్టారు. అలా చేసింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగా అటు నార్త్ లో ఇటు సౌత్ లో చాలా మంచి మార్కెట్ ని సంపాదించారు.అలా రెండు మూడు సినిమాలకే పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు.అయితే సందీప్ రెడ్డి వంగా తీస్తున్న తాజా మూవీ స్పిరిట్..ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పూర్తయిందని త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చేశారు.

అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగా ఆర్జీవి ఇద్దరు కలిసి జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా సెలబ్రిటీ ట్రాక్ షో కి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ వచ్చిన ఎపిసోడ్ ప్రస్తుతం జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే దీని ఫుల్ ఎపిసోడ్ జీ తెలుగులో ఆదివారం రాత్రి 9 గంటలకు వస్తుంది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ నుండి ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో సందీప్ రెడ్డి వంగా బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ గురించి చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.నా కెరియర్ లో నేను చూసిన బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అంటే బాహుబలి 2 మాత్రమే.. ఆ సీన్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ చూసి నేను నా ఆఫీస్ కి వచ్చి ఎడిటింగ్ సిస్టం ఆన్ చేసి మరీ ఇంటర్వెల్ సీన్ క్లియర్ గా చూశాను.

నాకు బాహుబలి ఇంటర్వెల్ సీన్ చూస్తే వణుకు పుట్టింది. ఇక ఈ సీన్ చూసే అర్జున్ రెడ్డి సినిమా ఇంటర్వెల్ సీన్ సెట్ చేసుకున్నాను. అయితే ఆ ఇంటర్వెల్ సీన్ చేసే సమయంలో నాకు చాలా భయమేసింది. కానీ ఆ తర్వాత రెండు రోజులకు మళ్లీ సీన్ బై సీన్ చూసుకుంటూ అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా అని క్లియర్ గా చూసుకున్నాను. ఆ తర్వాత మంచి ఇంటర్వెల్ పాయింట్ ని పట్టుకొని అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీన్ తీసాను. మొదట ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తాలో అని భయమేసింది.ఆ తర్వాత టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమా మీద నమ్మకం పెరిగింది అంటూ సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: