మిరాయి సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మొదటిసారి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది ఇది కూడా మామూలు అడ్వెంచర్ కథే అనుకున్నారు.. పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ త‌ర్వాత అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. విజువల్స్ అద్భుతంగా ఉండటంతో పాటు, ఈ స్థాయి క్వాలిటీని కేవలం రూ.60 కోట్లు బడ్జెట్‌లో పూర్తి చేశారన్న విషయం బయటకు రాగానే మరింత చర్చనీయాంశమైంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌మోష‌న్ల జోరు మామూలుగా లేదు. ఈ క్రేజ్‌ను మేక‌ర్స్ బిజినెస్ పరంగా కూడా బాగా క్యాష్ చేసుకుంటున్నారు. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.45 కోట్లకు పైగా వసూలు చేశారు. దాంతో పాటు ఇప్పటివరకు మొత్తం రూ.20 కోట్ల లాభాలు సాధించారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. తేజ స‌జ్జా లాంటి హీరో సినిమాకు ఇంత బిజినెస్ జ‌ర‌గ‌డం నిజంగా గ్రేట్‌.


చిన్న బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇంత పెద్ద స్థాయిలో బిజినెస్ చేయడం సాధారణ విషయం కాదు. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా మొదలైతే ఊహ‌కే అంద‌ని విధంగా బిజినెస్ ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తేజ‌ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మంచు మనోజ్, జగపతి బాబు, శ్రీయా శరణ్, రితికా నాయక్, జయరాం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: