టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన సినిమాల్లో ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి హంగామా చేస్తోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది .. మౌళి తనూజ్ హీరోగా, శివాని నాగరం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే మంచి టాక్ వచ్చింది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా ఆశించిన దానికంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆదిత్య హాసన్ నిర్మించగా, వంశీ నందిపాటి, బన్నీ వాస్ సంయుక్తంగా రిలీజ్ చేశారు. తాజాగా మేకర్స్ వెల్లడించిన ప్రకారం, కేవలం బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లోనే మూడు రోజుల్లో 2.9 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ రెస్పాన్స్ చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ముఖ్యంగా యువత ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తూ థియేటర్లకు క్యూ కడుతున్నారు.


కథలోని ఫ్రెష్‌నెస్, హీరో-హీరోయిన్‌ల కెమిస్ట్రీ, మ్యూజిక్ ఆకట్టుకోవడంతో యూత్ ప్రేక్షకులను బాగా కట్టిపడేస్తోంది. అలాగే రాజీవ్ కనకాల, అనిత చౌదరి, సత్యకృష్ణన్, జైకృష్ణ తదితరులు పోషించిన పాత్రలు సినిమాకి మరింత బలాన్ని ఇచ్చాయి. ఎమోషన్, కామెడీ, రొమాన్స్ అన్నీ మేళవించి ఫ్యామిలీ ఆడియెన్స్‌కీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు లేని పరిస్థితి ఉండటంతో లిటిల్ హార్ట్స్ లాంటి మధ్యస్థాయి సినిమాలకు మంచి థియేట్రికల్ అడ్వాంటేజ్ దక్కుతోంది. మొదటి వారాంతానికి వచ్చిన ఈ రెస్పాన్స్ చూస్తుంటే, ఈ సినిమా వచ్చే వారం కూడా బాక్సాఫీస్ దగ్గర హవా కొనసాగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి, యూత్‌ను ఆకట్టుకుంటూ, కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తూ లిటిల్ హార్ట్స్ ఈ సీజన్‌లో హిట్ టాక్ సాధించిన చిత్రంగా నిలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: