సినిమా ఇండస్ట్రీbలో ఒక సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకుంది అంటే ఆ సినిమా దాదాపు లాంగ్ లో భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ ఉంటుంది. ఇక అలా మంచి టాకును తెచ్చుకున్న సినిమా విడుదల అయినా రెండు , మూడు వారాల పాటు మంచి సినిమా విడుదల కాకపోవడం , ఒక వేళ సినిమాలు విడుదల అయిన ఆ మూవీలకు మంచి టాక్ రానట్లయితే లాంగ్ రన్ లో ఆ సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తాయి. అదే ఒక సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత విడుదల అయిన సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చినట్లయితే మొదట విడుదల అయిన సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ పరిస్థితి తెలుగు బాక్సా ఫీస్ దగ్గర ఓ మూవీ కి ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... పోయిన వారం లిటిల్ హాట్స్ అనే ఓ చిన్న సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో మొదటి వారం రోజులు ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర దక్కాయి. ఇక ఈ వారం మీరాయ్ , కిష్కింధపురి అనే రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ లకు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ కూడా దక్కే అవకాశాలు కనబడుతున్నాయి.

ఇలా ఈ వారం విడుదల అయిన రెండు సినిమాలకు అద్భుతమైన టాక్ రావడంతో లిటిల్ హాట్స్ సినిమాపై ఈ రెండు మూవీ ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని , లిటిల్ హాట్స్ కలెక్షన్లు చాలా వరకు తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి మిరాయ్ , కిష్కిందపురి సినిమాల దాటిని తట్టుకొని లిటిల్ హాట్స్ సినిమా రెండవ వారం కూడా మంచి కలెక్షన్లను వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: