దగ్గుబాటి వెంకటేష్ సినీ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో బొబ్బిలి రాజా సినిమా కూడా ఒకటి.. ఈ సినిమా 1990 లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా వెంకటేష్ సినీ కెరియర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ గా కూడా పేరు తెచ్చుకుంది. అలాగే ఈ సినిమా చాలా సెంటర్లలో 175 రోజులు ఆడి వెంకటేష్ కెరియర్ లో మర్చిపోలేని హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలై 35 సంవత్సరాలు అయిన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో దివ్యభారతి పోషించిన హీరోయిన్ రోల్ మొదట మరో హీరోయిన్ కి వచ్చిందట. కానీ ఆ హీరో రిజెక్ట్ చేయడంతో ఇందులో దివ్యభారతిని హీరోయిన్ గా తీసుకున్నారట.మరి ఇంతకీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన బొబ్బిలి రాజా సినిమాని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. 

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించిన బొబ్బిలి రాజా సినిమా 1990 సెప్టెంబర్ 14న విడుదలైంది. ఈ సినిమా కి ఇళయరాజా మ్యూజిక్ కూడా తోడవడంతో సినిమా మంచి హిట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట స్టార్ హీరోయిన్ గా అప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న రాధని తీసుకున్నారట. కానీ రాధ అప్పటికే స్టార్ హీరోయిన్ కాబట్టి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చివరికి ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. అలా రాధ రిజెక్ట్ చేయడంతో డైరెక్టర్ కొత్త హీరోయిన్ ని ఈ సినిమా కోసం తీసుకుందామని సెర్చ్ చేయగా బాలీవుడ్ నటి దివ్యభారతి ని ఫైనల్ గా ఓకే చేశారు.

అయితే దివ్యభారతికి మొదటి తెలుగు సినిమా ఇదే.అలాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో దివ్యభారతికి తెలుగులో మంచి గుర్తింపు రావడంతో పాటు మరిన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా రాధ రిజెక్ట్ చేయడంతో దివ్యభారతి కి టాలీవుడ్ లో ఆఫర్ వచ్చింది. ఇక టాలీవుడ్ లో దివ్యభారతి చేసినవి తక్కువే సినిమాలే అయినప్పటికీ ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసుకుంది. అలా బొబ్బిలి రాజా సినిమా విడుదలై సెప్టెంబర్ 14 ఆదివారానికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: