ఏంటి రాజమౌళి తేజ సజ్జా ఇద్దరు బంధువులా..ఇప్పటివరకు రాజమౌళి తేజ  సజ్జా సినిమాలకు వచ్చి సపోర్ట్ చేయనేలేదు.. మరి అలాంటిది వీరి మధ్య బంధుత్వం ఎక్కడిది అనుకుంటారు కొంతమంది..సపోర్ట్ చేస్తేనే బంధుత్వం ఉంటుందా ఏంటి అనుకుంటారు మరికొంత మంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే..తేజ సజ్జా రాజమౌళి ఇద్దరు బంధువులు అవుతారట..వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మరి ఇంతకీ రాజమౌళి తేజ సజ్జా ఇద్దరు బంధువులు ఎలా అవుతారు.. వీరిద్దరూ వరుసకు ఒకరికొకరు ఏమవుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. జాంబిరెడ్డి, హను మాన్,మిరాయ్ ఈ సినిమాలతో తేజ సజ్జా పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. 

జాంబిరెడ్డి సినీమా కాస్త పక్కన పెడితే హను మాన్, మిరాయ్ ఈ రెండు సినిమాలు తేజసజ్జా భవిష్యత్తులో టైర్ 1 హీరోగా అవుతాడు అనేదానికి నిదర్శనాలుగా మారుతున్నాయి. వెంట వెంటనే రెండు హిట్స్ కొట్టడంతో తేజ సజ్జా క్రేజ్ ఇండస్ట్రీ లో భారీగా పెరిగిపోయింది.హను మాన్ మూవీలో సూపర్ హీరోగా..మిరాయ్ మూవీలో సూపర్ యోధగా.. నటించిన తేజ సజ్జా క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. అలా మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్న తేజకి వెనక నుండి ఒకరు సపోర్ట్ చేస్తున్నారని, అది కూడా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి అంటూ ఒక రూమర్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.. రాజమౌళి తేజ సజ్జా ఇద్దరి మధ్య బంధుత్వం ఉందని, వీరిద్దరూ వరుసకు అన్నదమ్ముల అవుతారని..రాజమౌళికి తేజ దూరపు బంధువు అని, రాజమౌళికి తేజ తమ్ముడు అవుతాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

అంతేకాదు తేజసజ్జా ఎంచుకునే స్క్రిప్టులను రాజమౌళికి చెప్పి రాజమౌళి ఓకే చేస్తేనే తేజ వీటికి ఓకే చెప్పి సినిమాలు చేస్తారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. అలా వెనక నుండి రాజమౌళి తేజ కి సపోర్ట్ చేయడం వల్లే తేజా సజ్జా ఇండస్ట్రీలో స్టార్ హీరో హోదా సంపాదించుకుంటున్నారని,తేజసజ్జా సక్సెస్ కి కారణం వెనుక నుండి రాజమౌళి ఇస్తున్న సపోర్టే నంటూ ఓ రూమర్ వినిపిస్తోంది.మరి నిజంగానే రాజమౌళి తేజ సజ్జా ఇద్దరు బంధువులా..వీరి మధ్య దూరపు బంధుత్వం ఉందా..రాజమౌళి సపోర్ట్ వల్లే తేజ సజ్జా ఇండస్ట్రీలో రాణిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: