
ఈ డైరెక్టర్ తీసిన తాజా సినిమా ఒక రొమాంటిక్ సాంగ్ లేకుండా, ఒక ముద్దు సీన్ లేకుండా, ఒక్క బూతు డైలాగ్ లేకుండా, ఎక్స్పోజింగ్ షాట్స్ లేకుండా పూర్తిగా కథ, భావోద్వేగాలు, కంటెంట్‌తో నిండిపోయింది. ఆశ్చర్యకరంగా ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రేక్షకులు మంత్ర ముగ్ధులై కరతాళ ధ్వనులతో ప్రశంసలు కురిపించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇంతకు ముందు “ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టే మేము ఈ తరహా సీన్స్ పెడుతున్నాం” అని సమర్థించుకున్న డైరెక్టర్ల వాదనలను ఈ సినిమా ఒక్కటే తారుమారు చేసింది. “ప్రేక్షకులు కోరుకోవడం కాదు, మేము చూపిస్తున్నాం కాబట్టే వారు చూస్తున్నారు” అని కొందరి వాదన. ఈ రెండు వాదనల మధ్య నిజం ఎక్కడుందో ఈ డైరెక్టర్ ఘాటుగా చూపించాడు.
సినిమా మంచి కథ, బలమైన ఎమోషన్, నిజమైన నటన, సరికొత్త ప్రెజెంటేషన్ ఉంటే మసాలా కంటెంట్ అవసరం లేకుండానే సినిమా సూపర్‌హిట్ అవుతుందని ఈ విజయంతో నిరూపించాడు. ఈ డైరెక్టర్ సినిమా కథతోనే కొట్టిన దెబ్బ బూతు సీన్స్‌పై ఆధారపడే డైరెక్టర్లకు పెద్ద పాఠం నేర్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఈ డైరెక్టర్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. “సినిమాను కథతోనే నిలబెట్టే, బూతు కంటెంట్‌కు లొంగని, నిజమైన నిక్కాస్ డైరెక్టర్” అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇకపై ఈ ట్రెండ్ కొత్త తరం డైరెక్టర్లకు స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉందని సినీ విమర్శకులు అంటున్నారు.