తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మొదలై ఇప్పటికే వారం కావస్తోంది. ఈవారం ఎలిమినేషన్ కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన శ్రేష్ఠ వర్మ హౌస్ నుంచి బయటికి వచ్చారు. బిగ్ బాస్ 9 సీజన్ మొదలైనప్పటి నుంచి ఈ సీజన్ రెస్పాన్స్ భారీగానే దూసుకుపోతోంది. ఈసారి సామాన్యులు, సెలబ్రెటీల మధ్య హోరాహోరీ పోటీగా డిజైన్ చేసిన గేమ్స్ షో ఆడియన్స్ ని మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక హౌస్లో ఎవరు ఎలా ఆడుతున్నారు? ఎవరి మెంటాలిటీ ఏంటి అనే విషయం మాత్రం ఆడియన్స్ డిసైడ్ చేస్తారు.

ఈసారి సీజన్లో కంటెస్టెంట్లు పట్ల ఒకరి మీద ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఒక కంటెస్టెంట్ పట్ల మాత్రం షో ఫాలో అవుతున్న ఆడియన్స్, నెటిజెన్స్ లో కాస్త పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగానే కనిపిస్తున్నట్లు ఉన్నది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ గా పేరు సంపాదించిన సుమన్ శెట్టి.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి తన కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించిన సుమన్ శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్ లో తన ఇన్నోసెంస్స్ తో కొన్ని సందర్భాలలో ఎంటర్టైన్మెంట్ బాగానే ఇస్తున్నారు.


అలాగే ఎమోషన్స్ పరంగా కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉండడంతో పాజిటివ్గానే ఈ కంటెస్టెంట్  పైన ఆడియన్స్ ఉందని చెప్పవచ్చు.మరి ఈ పాజిటివ్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి మరి. మొదట సుమన్ శెట్టి బిగ్ బాస్ కి సెట్ కాడేమో అనుకున్నారు కానీ బిగ్ బాస్ టాస్కులు, గేమ్లను అర్థం చేసుకుంటూ మరి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అలాగే బిహేవియర్ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే ఈసారి హౌస్ లో సుమన్ శెట్టి ఆడియన్స్ కి చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: