
కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇటువంటిదే అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చులో
దానిలో 10% ఖర్చుతో (పవర్ ) ఎత్తి పోస్తే కోస్తా ప్రాంతంలో మెట్ట భూములు అన్నిటికీ నీళ్లు ఇవ్వచ్చు అని.. ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్టు కూడా అనవసరంగా ఖర్చు తప్పా ధీర్ఘకాలంలో ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చెప్పలేం అనే వాళ్లే ఎక్కువుగా ఉంటున్నారు. చంద్రబాబు రాయలసీమకు నీళ్లు పట్టుకు పోవాలి అనుకుంటున్నారని , కోస్తా వాళ్ళు ఎండిపోయినా పర్వాలేదా ? కోస్తా వాళ్లకు అమరావతిని రాజధానిగా చేశాం కదా ? అని అమరావతిని చూపించి 6 కోస్తా జిల్లాలకి ఒక పథకం ప్రకారం అన్యాయం చేస్తున్నారా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు కోస్తా ఏరియాల్లో ఉన్న టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
ఎక్కడో కుప్పం కి 700 కిలోమీటర్ల కృష్ణా నీళ్లు పట్టుకుపోయారు .. మంచిదే .. కానీ కృష్ణ నదికి 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న పల్నాడు, పశ్చిమ కృష్ణ ప్రాంతాలకి నీళ్లు లేవు ? మరి వీళ్లకు ఎలా ? న్యాయం చేస్తారన్న ప్రశ్నలు ఇప్పుడు చంద్రబాబుకు సంధిస్తున్నారు. 6 దశలలో పంప్ చేసి గోదావరి నీళ్లు సీమకు పట్టుకు పోతారు .. కానీ అదే పోలవరం కాలువకి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి మెట్ట ప్రాంతం రైతులు 400 అడుగుల లోతు నుంచి బోర్లు ద్వారా తోడి వ్యవసాయం చేస్తున్నారు. వీరి బాధలు ఎవ్వరికి పట్టవా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా చంద్రబాబు రాజధాని ఒక్కదానిని బూచీగా చూపించి కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు .. మనకు ప్రశ్నించే సమయం వచ్చింది అని కోస్తా వాళ్లు సోషల్ మీడియా వేదికగా గొంతెత్తుతున్నారు.