
ఇక నందమూరి హరికృష్ణ తో తారక్ స్క్రీన్ షేర్ చేయకపోయినా, ఆయన తో నటించిన చాలా మంది యాక్టర్ల తో తారక్ కలిసి నటించాడు . అందులో హీరోయిన్ గజాల కూడా ఒకరు. గజాల 2001లో ‘నాలో ఉన్న ప్రేమ’ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది , కానీ ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు . ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెంబర్-1’లో నటించి మంచి హిట్ అందుకుంది . ఆ తర్వాత ‘అల్లరి రాముడు’లో మరోసారి ఎన్టీఆర్ తో నటించింది. అయితే, గజాల టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సాధించలేకపోయింది .
ఆమె నందమూరి హరికృష్ణ తో ‘శ్రావణ మాసం’ సినిమాలో కోడలి పాత్రలో నటించింది . ఈ విధంగా ఎన్టీఆర్‌కు లవర్‌గా, భార్యగా నటించిన గజాల , హరికృష్ణ కు కోడలు గా కూడా నటించింది . ఇక హరికృష్ణ, 1956 సెప్టెంబర్ 2న ఎన్టీఆర్ దంపతులకు జన్మించాడు. 11 ఏళ్ల వయసులో ‘శ్రీకృష్ణావతారం’ సినిమాలో బాలనటుడి గా ఎంట్రీ ఇచ్చాడు. దక్షిణాదిలో తొలి నట వారసుడిగా గుర్తింపు పొందాడు. ‘తాతమ్మ కల’, ‘దాన వీర శూర కర్ణ’ వంటి సినిమాల్లో నటించిన హరికృష్ణ , తక్కువ సినిమాల తోనే తనదైన ముద్ర వేశాడు . ఎన్టీఆర్ రాజకీయాల్లో కి వెళ్లడం తో ఆయన సినిమాలకు దూరమయ్యాడు .