అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అఖిల్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరో గా నటించాడు. కానీ ఆయనకు అదిరిపోయే సూపర్ సాలిడ్ విజయం మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. అఖిల్ ఆఖరుగా ఏజెంట్ అనే సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత అఖిల్ నెక్స్ట్ మూవీ ని ఓకే చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. అఖిల్ కొంత కాలం క్రితమే లెనిన్ అనే మూవీ ని ఓకే చేశాడు.

మూవీ ఓకే అయిన తర్వాత ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఆ గ్లిమ్స్ వీడియోలో ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ నుండి శ్రీ లీల తప్పుకుంది. దానితో ఈ మూవీ లో శ్రీ లీల స్థానంలో భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్గా తీసుకున్నారు. ఇలా శ్రీ లీల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త డిలే అయినట్లు తెలుస్తోంది. శ్రీ లీల వల్ల మాత్రమే కాకుండా కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో యూనియన్ సమ్మెతో షూటింగ్లు ఆగిపోయిన విషయం మన అందరికి తెలిసిందే. దాని కారణంగా కూడా ఈ సినిమా షూటింగ్ కొంత కాలం ఆగిపోయినట్లు తెలుస్తోంది.

ఇలా శ్రీ లీల వల్ల కొంత కాలం పాటు , యూనియన్ సమ్మెతో మరి కొంత కాలం పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఈ మూవీ విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట అనుకున్న విడుదల తేదీన కాకుండా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలువడబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: