- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ యాక్షన్ డ్రామా సినిమాను తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌తో కూడిన సెట్‌లు, టెక్నికల్ టీమ్‌ను సిద్ధం చేస్తూ, అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు తన స్వంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌లో సందీప్ ఓ చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది.


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన వేణు అనే యువకుడిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. హీరోగా ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్‌ను ఎంచుకున్నారు. తెలంగాణ నేపథ్యంలోని ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుండగా, త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సందీప్ రెడ్డి నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఆ ప్రాజెక్ట్‌పై పరిశ్రమ మొత్తానికి దృష్టి పడుతుంది. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, ఆయన ముద్ర వుంటుందని అందరికీ తెలుసు. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: