పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్లో  తెరకెక్కిన ఓజీ సినిమా  ట్రైలర్ కోసం  పవన్ అభిమానులు ఎదురుచూడగా నిరీక్షణలు ఫలించాయి.  ఎట్టకేలకు ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2025 బిగ్గెస్ట్ హిట్ పవన్ కళ్యాణ్ ఖాతాలో చేరనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.  ట్రైలర్ మాత్రం ఈ ఏడాది బెస్ట్ ట్రైలర్లలో  ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది.

ఓజీ సినిమా ట్రైలర్ లో పవన్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించింది కొన్ని సెకన్లు మాత్రమే అయినా  ఆమె హైలెట్ గా నిలిచారు.  ఓజీ ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.  లైక్స్ విషయంలో సైతం ఓజీ ట్రైలర్ అదరగొడుతోంది.  సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఓజీ సినిమా ట్రైలర్ విడుదల కావడం  ఇండస్ట్రీలో ఒక సంచలనం అని చెప్పవచ్చు.

ఓజీ సినిమా నిడివి ఎక్కువ మొత్తం కాగా  ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రీమియర్స్ బుకింగ్స్ మొదలైతే మాత్రం ఓజీ  సంచలనాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో క్లారిటీ వస్తుంది.  ఓజీకి టికెట్ రేట్ల పెంపు కూడా ఊహించని స్థాయిలో కలిసొస్తోంది.

పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచినా ఆ సినిమా ప్రభావం ఓజీ సినిమాపై ఏ మాత్రం పడలేదు.  ఓజీ మూవీ హక్కులు భారీ రేట్లకు  అమ్ముడవగా డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా మంచి లాభాలను అందించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.  ఓజీ ఫస్ట్ డే కలెక్షన్లు 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది.                                                                                                                                                                                                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: