పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే బాక్సాఫీస్ వద్ద ఎంత హంగామా ఉంటుందో, ఫ్యాన్స్ ఎంత సందడి చేస్తారో తెలిసిందే. బిజినెస్ లెక్కలు కూడా ఆ బిగ్ నెంబర్‌లోనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా కచ్చితంగా లాభాల వర్షం కురిపిస్తుంది అనేది అభిమాని నమ్మకం. కొంతమంది మేకర్స్ కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఉంటారు.అయితే ఈసారి ఓజీ సినిమా టోటల్లీ స్పెషల్. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని పైకి తీసుకెళ్లడమే కాదు, నిర్మాతలను కూడా ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లే రేంజ్‌లోనే డైరెక్టర్ పనిచేశారని రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, మూవీ అప్డేట్స్ ఆధారంగా స్పష్టంగా తెలుస్తోంది.


సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత అంత గట్టిగా మాట్లాడుకోవాల్సిన పేరు నిర్మాత దానయ్యది. దానయ్య వెరీ వెరీ లక్కీ ఫెలో. ఏనాడో ఇచ్చిన అడ్వాన్స్‌ని ఆర్‌ఆర్ఆర్ కింద మార్చేశారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఉన్న అనుబంధం బంధంగా మారి ఇప్పుడు ఓజీ ప్రాజెక్ట్ సాధ్యమైనట్లు మారింది. పవన్‌తో ఇంత పెద్ద సినిమా వస్తుందని దానయ్య కలలో కూడా ఊహించలేకపోయి ఉండొచ్చని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా మార్కెట్ నెంబర్లు వింటే ఫ్యూజులు ఎగిరిపోవాలి. ఇప్పటివరకు లేని విధంగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ఓజీ సినిమా ఓటిటి హక్కులు కేవలం 81 కోట్లకు విక్రయించారు. ఆడియో హక్కులు ఏకంగా 18 కోట్లకు అమ్మినట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ హక్కులు కూడా 16 కోట్లకు విక్రయించారని వార్తలు వచ్చాయి. ఇంకా సాటిలైట్ హక్కులు చేతిలోనే ఉన్నాయి.సాటిలైట్ హక్కులు కాకుండా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా దాదాపు 123 కోట్ల ఆదాయం వచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సాటిలైట్ కలిపేసుకుంటే 150 కోట్ల దగ్గరికి చేరుతుంది. ఇప్పుడు థియేటర్ బిజినెస్ చూద్దాం.



ఆంధ్ర ఏరియాను దాదాపు 80 కోట్ల మార్కెట్‌కు సెట్ చేశారు. సీడెడ్ ఏరియా అయితే ఏకంగా 23 కోట్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లకు అమ్మినట్లు వార్తలు ఉన్నాయి. “ఇంత బజ్ ఉన్న తర్వాత ఇంకాస్త ఎక్కువ వచ్చుండేది” అనేది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.అవన్నీ పక్కన పెడితే, నైజాం రైట్స్ ఏ సినిమా అయినా ఎక్కువ ప్రాధాన్యం పొందుతాయి. ఓజీ విషయంలో నైజాం థియేటర్ హక్కులు దాదాపు 50 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇక కర్ణాటక రైట్స్ ఏకంగా 7 కోట్లకు ఇచ్చారు. అంటే టోటల్‌గా 187 కోట్లకు పైగానే థియేటర్ ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.



ఎలా లేదన్నా థియేటర్ + నాన్-థియేటర్ కలిపి సుమారుగా 320 కోట్లకు చేరుకుంటుంది. ఇప్పుడు ఖర్చు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 60-70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సినిమా నిర్మాణ ఖర్చు, వడ్డీలు, పబ్లిసిటీ వగైరా అన్నీ కలిపి మరొక 100 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కల ప్రకారం కూడా ఆర్‌ఆర్ఆర్ స్థాయిలో దానయ్యకు మంచి లాభాలు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దానయ్య లక్కీ అని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. చూడాలి మరి, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎలాంటి సెన్సేషనల్ రికార్డ్స్‌ని బద్దలు కొడుతూ దానయ్యకు లైఫ్ టైమ్ జాక్‌పాట్ ఇస్తుందో చూడాలి..??

మరింత సమాచారం తెలుసుకోండి: