పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకే పెద్ద హీరో కానీ ఇప్పటివరకు ఆ ఒక్కటి సాధించలేకపోయారు అంటూ కొంతమంది పవన్ హేటర్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా తెలిసిన హీరో కం లీడర్.. అయినా కానీ ఇప్పటివరకు ఆయన ఒక్కటి మాత్రం సాధించలేకపోయారు. ఈయన కంటే తక్కువ పేరున్న హీరోలు, చిన్న హీరోలు సైతం ఆ రికార్డుని అందుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రికార్డును ఇప్పటివరకు అందుకోలేక పోయారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అందుకొని ఆ రికార్డు ఏంటి అనేది చూస్తే 100 కోట్ల కలెక్షన్స్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్లకు ఇష్టమైన హీరో.

కానీ అలాంటిది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టలేదు. ఈయన కంటే తక్కువ పేరున్న అలాగే చిన్న హీరోలు సైతం 100 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి అద్భుతం సృష్టించారు. కానీ ఇంత పేరు ఉండి ఏం లాభం పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోలేకపోయింది అంటూ కొంతమంది ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ పై వచ్చే నెగటివ్ ట్రోలింగ్ పై అభిమానులు తిప్పి కొడుతున్నారు.

భారీ అంచనాలతో వస్తున్న ఓజి మూవీ కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరుతుంది అని పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ ఓజి మూవీ సాధిస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు.మరి ఓజి మూవీతోనైనా పవన్ కళ్యాణ్ వంద కోట్ల క్లబ్ లో చేరుతారా.. 100 కోట్ల క్లబ్ లో చేరి తన ఖాతాలో ఆ రికార్డును వేసుకుంటారా అనేది చూడాలి..ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లు మూవీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరే లేకపోయింది.అయితే అభిమానుల ఆశలన్నీ ఓజి మూవీ పైనే ఉన్నాయి. కచ్చితంగా ఓజి మూవీతో పవన్ కళ్యాణ్ వంద కోట్ల క్లబ్ లో చేరుతారు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్ సినిమాపై భారీ హెప్ పెంచింది.అందుకే సినిమా చూడడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ సినిమా టాక్ బాగుంటే గనక పవన్ కళ్యాణ్ ఖాతాలో కూడా 100 కోట్ల మూవీ పడడం పక్కా..

మరింత సమాచారం తెలుసుకోండి: