
అదే సమయంలో మండలిలో బొత్స ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో జీఎస్టీ అమలు విషయంలో కేంద్రాన్ని పొగడుతూ తీర్మానం వస్తే దానిని వ్యతిరేకిస్తామని ఆయన చెప్పినట్టుగా సమాచారం. దీంతో సభలోనూ ఆయన అదే చేస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో పై నుంచి ఒత్తిడి రావడంతో ఆయన వ్యతిరేకించలేదు. అలాగని సమర్థించకపోవడం గమనార్హం. చివరికి మండలి చైర్మన్ తీర్మానాన్ని పాస్ అయినట్టుగా ప్రకటించగా, బొత్స వైఖరి ఎక్కడో ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా మారిందన్న భావన బలపడింది.
మాజీ సీఎం జగన్ ప్రస్తుతం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. బీజేపీతో సంబంధాలను కాపాడుకోవడం ఆయనకు తప్పనిసరి. ఎందుకంటే ఆయనపై ఉన్న కేసులు, ఆరోపణలు నేపథ్యంలో బీజేపీకి ఎదురు వెళ్లే పరిస్థితి లేదు.
అందుకే కేంద్రం ఏం చేసినా, తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైనా వాటిని మద్దతు ఇస్తూ వెనకాడడం లేదు. ఇలాంటి సందర్భంలో బొత్స మాత్రం విరుద్ధంగా ప్రవర్తించడం జగన్ కు మరింత అసహనానికి కారణం అవుతోంది. అంతేకాదు, బొత్స ఇటీవలి వ్యక్తిగత వ్యవహారాలు కూడా పార్టీ లోపల అనుమానాలకు దారి తీస్తున్నాయి. షర్మిలతో ఆయన ఆత్మీయ సంబంధాలు, రఘురామ కృష్ణ రాజు వంటి వారితో బొత్స క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. పైగా మండలిలో కూడా ప్రభుత్వం పట్ల ఆయన తీసుకుంటున్న సడలింపు వైఖరి జగన్ లో కోపానికి కారణమవుతోందట. మొత్తం మీద, బొత్స ప్రవర్తన వైసీపీలో విభిన్న చర్చలకు కారణమవుతుండగా, త్వరలోనే జగన్ స్వయంగా బొత్సకు తానేంటో చూపించే అవకాశం ఉందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గత రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశం ఉంది.