పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. నిర్మాత దానయ్యకు ఈ సినిమా భారీ స్థాయిలోనే లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఊహించని స్థాయిలో హైప్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు, రెమ్యునరేషన్లకు మరో 100 కోట్ల  రూపాయలు ఖర్చయిందని తెలుస్తోంది.

ఓజీ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ 81 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోగా ఇతర హక్కులు 32 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.  ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 153 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.  మొత్తం 300 కోట్ల రూపాయల రేంజ్ లో  బిజినెస్ జరగగా ఓజీ సినిమా బిజినెస్ విషయంలో ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించిందనే సంగతి తెలిసిందే.

ఓజీ సినిమా ఇతర రాష్ట్రాల హక్కులు, ఓవర్సీస్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.ఓజీ సినిమా సాధిస్తున్న రికార్డులు ఫ్యాన్స్ కు ఎంతో  ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓజీ సినిమా సక్సెస్ కు టాక్ కీలకం కానుంది. ఈ సినిమా ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా మిరాయ్ సినిమా కూడా చెప్పుకోదగ్గ థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. ఓజీ సినిమా సరికొత్త రికార్డులు, సంచలన రికార్డులు  క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓజీ సినిమా  నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేయాలనీ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే పవన్ కళ్యాణ్ మరిన్ని  సినిమాలలో నటించే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.  ఓజీ సినిమా ఏ స్థాయిలో ఇండస్ట్రీని షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: