సాధారణంగా ఏ స్టార్ సెలబ్రిటీ బయటకు వచ్చినా ఆయన వేసుకున్న దుస్తులు, ధరించిన షూస్, చేతికి పెట్టుకున్న వాచ్, హేయిర్ స్టైల్, లేదా వేసుకున్న యాక్సెసరీస్ అన్నీ ఒక ట్రెండ్ అవుతాయి. ఆ చిన్న చిన్న విషయాలనే అభిమానులు పెద్ద చర్చగా మార్చుకుంటారు. ఇప్పుడు అలాంటి హాట్ టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా వచ్చింది. ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. భారీ వర్షం కురిసినా కూడా అభిమానులు ఒక్క అడుగు వెనక్కి వేయకుండా "మనల్ని ఎవడ్రా ఆపేది" అన్నట్టుగా ముందుకు దూసుకెళ్లి ఈవెంట్‌ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఆ విజువల్స్ చూసిన ప్రతి ఒక్క అభిమాని గర్వంగా ఫీలయ్యేలా, లైఫ్‌లో మర్చిపోలేని మూమెంట్‌గా మారింది.


అయితే ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌ను గమనించినవారు ఒక ఆసక్తికరమైన విషయం గుర్తించారు. ఆయన వేసుకున్న బ్లాక్ షర్ట్ లోపల స్పష్టంగా ఒక బంగారు జంధ్యం కనిపించింది. ఫొటోలు, వీడియోలు జూమ్ చేస్తే అది క్లియర్‌గా తెలుస్తోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి జంధ్యాలు బంగారు యాక్సెసరీస్ వాడటం చాలా అరుదు. మెగా హీరోలలో కూడా ఇంతవరకు ఎవ్వరూ బంగారు జంధ్యం వేసుకున్నట్లు కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి ప్రత్యేకంగా ధరించడం అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది.



ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న – పవన్ కళ్యాణ్ ఈ బంగారు జంధ్యం ఎందుకు వేసుకున్నారు..? కొందరు ఇది ఆయన వ్యక్తిగత సెంటిమెంట్ లేదా అదృష్టానికి సంబంధించిన విషయం అయి ఉంటుందని అంటున్నారు.మరికొందరు ఓజీ సినిమాలో ఆయన గెటప్‌కి రీలేటెడ్‌గా ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఇంకొందరు ఇది పవన్ కళ్యాణ్ యొక్క ఒక బిగ్ సింబల్, ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన మెసేజ్ కావచ్చని భావిస్తున్నారు.



అయితే దీనిపై ఓజీ టీం, జనసేన టీం, లేదా పవన్ కళ్యాణ్ దగ్గరి వర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. ఇది పూర్తిగా ఆయన పర్సనల్ విషయం కావడంతో ఎవరూ బయటకు మాట్లాడటానికి ముందుకు రాలేదు.కానీ ఒక విషయం మాత్రం ఖాయం – పవన్ కళ్యాణ్ ఏం చేసినా, ఏం వేసుకున్నా, ఏం మాట్లాడినా అది అభిమానులకు ఒక సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు ఆయన ధరించిన ఈ బంగారు జంధ్యం కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోయింది. ఇది నిజంగానే ఆయనకు వ్యక్తిగత సెంటిమెంట్ అవుతుందా..? లేక సినిమాకి సంబంధించిన లుక్కా..? అనేది చూడాలి..???

మరింత సమాచారం తెలుసుకోండి: