ఏదైనా కొత్త సినిమా విడుదల అయితే చాలు అందులో ఉండే కొత్త తారాగణం ఎవరైనా ఉన్నారా.. ఒకవేళ ఎవరైనా సినిమాలో హైలైట్ అయి ఉంటే అందులో వైరల్ అయిన వారు ఎవరు అని తెలుసుకునే పనిలో పడతారు చాలామంది సినీ ప్రేక్షకులు. అయితే తాజాగా ఓజి మూవీలో కళ్ళతో మత్తెక్కించిన ఓ బ్యూటీ గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియా జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్గా ఓజి మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.ఆ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి వంటి కొంతమంది కీలకపాత్రల్లో కనిపించారు. అయితే వీరందరితోపాటు ఓజీ ట్రైలర్ లో మరో అమ్మాయి కూడా ఫేమస్ అయింది.

బ్యూటీ కనిపించింది ఒక్క సీనే కానీ తన కళ్ళతోనే మత్తెక్కించింది.మరి ఇంతకీ ఓజీ ట్రైలర్ లో కళ్ళతో మత్తెక్కిస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయిన ఆ బ్యూటీ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.తాజాగా విడుదలైన ఓజీ ట్రైలర్ లో కళ్ళతో మత్తెక్కిస్తున్న ఆ బ్యూటీ నారా రోహిత్ కి కాబోయే భార్య నటి సిరిలేళ్ల అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుండి సిరిలేళ్ల పవన్ కళ్యాణ్ ఓజి మూవీలో నటిస్తోంది అనే రూమర్లు వినిపించాయి. అయితే అవి రూమర్లు కాదు నిజమే అంటూ నారా రోహిత్ తన మూవీ ప్రమోషన్స్ లో కన్ఫామ్ చేశారు.

సిరిలేళ్ల ఓజి మూవీలో నటిస్తోంది అని చెప్పడంతో తాజాగా విడుదలైన ట్రైలర్లో కళ్ళతో మత్తెక్కిస్తున్న ఆ బ్యూటీ సిరి లేళ్లనే అంటూ అందరూ కన్ఫర్మ్ అవుతున్నారు.మరి ఆ హీరోయిన్ సిరి లేళ్ళనా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. ఇక సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కించిన ఓజి మూవీ మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు అనే సంగతి తెలిసిందే.రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని వీరమాస్ లెవెల్ లో ఎంట్రీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: