తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఎంతో బలంగా నిలబడి కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు. పవన్ ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు రాజకీయాల్లో కూడా కొనసాగుతూ పవన్ ప్రస్తుతం అత్యంత బిజీ గా ఉన్నాడు.

పవన్ ఓ నటుడి జీవితం మొత్తాన్ని మార్చి వేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మంచు మనోజ్ ఒకరు. ఈయన చాలా కాలం క్రితమే నటుడుగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే కెరియర్లో మొట్ట మొదటి సారి మంచు మనోజ్ , తేజ సజ్జ హీరో గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మీరాయ్ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇందులోని మనోజ్ పాత్రకు అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.

మనోజ్ విలన్ పాత్రలో నటించడానికి ఒక కారణం ఉన్నట్లు , ఒక హీరో వల్లే విలన్ పాత్రలో నటించడం పై ఆసక్తి కలిగినట్లు మనోజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజాగా మనోజ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఒక సారి నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసాను. ఆ సమయంలో ఆయన మీరు విలన్ గా చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు. దానితో నేను విలన్ గా చేయాలి అనుకున్నాను ... చేశాను. ఇప్పుడు మీరాయ్ సినిమాలోని విలను పాత్ర ద్వారా నా కెరియర్ మొత్తం టర్న్ అయింది అని మనోజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: