ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరు, ఆయన తాజా చిత్రం ఓజీ గురించే ఎక్కువ తాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా  ప్రతిభావంతుడైన దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తొలిసారి గ్యాంగ్‌స్టర్ డ్రామాలో నటించడం సినీ ప్రేక్షకులలోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాలలోనూ విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ చేయడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. సుజిత్ పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది సాహో. ఆ సినిమాలో ఆయన చూపించిన స్టైలిష్ ప్రెజెంటేషన్, విజువల్స్, హీరో లుక్స్ అన్నీ ఇప్పటికీ మర్చిపోలేని రీతిలో గుర్తుంటాయి. ఇప్పుడు అదే తరహా హై స్టాండర్డ్స్‌ను పవన్ కళ్యాణ్ కోసం ఉపయోగించి ఆయన లుక్స్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్ అన్నింటినీ మరింత హైలైట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి చేసిన ప్లానింగ్, ప్రమోషన్స్ అన్నీ చూసినా సుజిత్ & టీమ్ ఎంత స్ట్రాంగ్‌గా పని చేశారో అర్థమవుతుంది.


ఇవన్నీ పక్కన పెడితే, సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న హాట్ టాపిక్ ఓజీ సినిమా బిజినెస్. ఈ సినిమాకి ఉన్న విపరీతమైన అంచనాల కారణంగా అన్ని డీల్స్ కూడా భారీ స్థాయిలోనే క్లోజ్ అయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఓజీ ఫుల్ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.172.50 కోట్లు సాధించిందట. ఇది నిజంగా టాలీవుడ్‌లో చాలా పెద్ద నెంబర్. ఈ సంఖ్య ఆధారంగా చూస్తే, థియేట్రికల్ బిజినెస్ లిస్టులో ఓజీ సినిమా 12వ స్థానాన్ని దక్కించుకుంది. మరి ఫ్స్ట్ అండ్ సెకండ్ స్ధానాలల్లో ఏ సినిమాలో నిలిచాయి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!




మరి ఆ టాప్ సినిమాల లిస్ట్ ఇలా ఉంది:

పుష్ప 2: ది రూల్ – రూ.617 కోట్లు

ఆర్ఆర్ఆర్ – రూ.451 కోట్లు

కల్కి 2898 ఏడీ – రూ.370 కోట్లు

బాహుబలి 2 – రూ.352 కోట్లు

సలార్ – రూ.345 కోట్లు

సాహో – రూ.270 కోట్లు

ఆది పురుష్ – రూ.240 కోట్లు

గేమ్ ఛేంజర్ – రూ.221 కోట్లు

రాధే శ్యామ్ – రూ.202.80 కోట్లు

సైరా నరసింహరెడ్డి – రూ.187.25 కోట్లు

దేవర పార్ట్ 1 – రూ.182.55 కోట్లు

ఓజీ – రూ.172.50 కోట్లు



అంతేకాకుండా, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే చూసినా ఓజీ మరో రికార్డు సాధించింది. మొత్తం రూ.145 కోట్ల బిజినెస్ జరుపుకుని ఆ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. ఆ లిస్ట్‌లో కూడా టాప్ ప్లేస్ పుష్ప 2దే, అది రూ.213 కోట్ల భారీ బిజినెస్‌తో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, సలార్ వరుసగా నిలిచాయి. ఈ లెక్కలన్నీ చూస్తుంటే, ఓజీ సినిమా రిలీజ్‌కి ముందే ఎంతటి బజ్ క్రియేట్ చేసిందో అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక పండగ లాంటిది కాగా, ట్రేడ్ వర్గాలు మాత్రం సినిమా థియేట్రికల్ రన్ ప్రారంభం అయిన తర్వాత మరిన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: