అగ్రరాజ్యమైన అమెరికాలో భారతీయులపై చాలా వివక్షత చూపిస్తున్నారు. అమెరికన్స్ కూడా ఇప్పటికే ఎన్నో నినాదాలు చేస్తున్నారు.అయితే తాజాగా అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ఒక రిపబ్లిక్ పార్టీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు మతపరంగా అక్కడ తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. టెక్సాస్ సుగర్ ల్యాండ్ లో ప్రతిష్టించినటువంటి 90 అడుగుల హనుమాన్ విగ్రహం పైన అలెగ్జాండర్ డంకన్ నేత చేసిన వ్యాఖ్యలు హిందువులని సైతం కించపరిచేలా ఉన్నాయని అక్కడ భారతీయులు ఫైర్ అవుతున్నారు.

ముఖ్యంగా మనది ఒక క్రైస్తవ దేశమైనప్పటికీ ఇలాంటి తప్పుడు హిందూ దేవుడు విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు అనుమతిస్తున్నామంటూ? తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. అలెగ్జాండర్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికాలో పెరుగుతున్న మతపరమైన విద్వేషాలకు అలాగే వలసదారుల గుర్తింపునకు సంబంధించి చాలా సున్నితమైన అంశాలను మరొకసారి తెరమీదకి తీసుకువచ్చేలా చేస్తున్నాయి. అలెగ్జాండర్ చేసిన ఈ వ్యాఖ్యలను చాలా మంది తీవ్రంగా ఖండిస్తున్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి అని అభివర్ణించారు.


రిపబ్లికన్ పార్టీ అలెగ్జాండర్ చేసిన వ్యాఖ్యలకు హిందూ అమెరికన్ సంఘాలు రిపబ్లికాన్ పార్టీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందూ వ్యతిరేకత సృష్టిస్తున్నారని మీ పార్టీ నియమాలకు వ్యతిరేకంగా అలెగ్జాండర్ వ్యవహరిస్తున్నారంటూ హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కూడా అలెగ్జాండర్ చేసిన వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. దీంతో పలువురు నెటిజెన్స్ అలెగ్జాండర్ పైన విరుచుకుపడుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ వివాదానికి కారణమైన హనుమాన్  విగ్రహం టెక్సాస్ లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో చాలా గ్రాండ్గా ప్రతిష్టించారు. సుమారుగా 90 అడుగులు ఎత్తైన ఈ కాంస్య  విగ్రహం  ఒక మతానికి పరిమితమైంది కాదు భక్తి ,బలం ఐక్యతలను ప్రత్యేకగా భావిస్తారు అంటూ తెలియజేశారు. యూఎస్ఏ లో ఎంతోమంది హిందువులు ఈ విగ్రహం తమ సంస్కృతికి గుర్తింపుగా ఉంటుందంటూ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: