తెలుగు, హిందీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటి చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. అలా ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, తదితర చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించింది. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాయి.


ఆ తర్వాత బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ వరస అవకాశాలను దక్కించుకుంది. ఇదంతా ఇలా ఉండగా ఆవికా గోర్ త్వరలోనే పెళ్లి పీటలు  ఎక్కబోతున్నట్లు తెలియజేసింది. 2025 జూన్ లో ఈ ముద్దుగుమ్మ  మిలింద్ చంద్వానితో  ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా వివాహ తేదీని కన్ఫామ్ చేస్తూ సెప్టెంబర్ 30వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలతో అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



మిలింద్ చంద్వాని, ఆవికా గోర్ 2020లో నుంచి డేటింగ్ లో ఉన్నారు. 2019లో ఒక ప్రోగ్రాంలో మిలింద్ చంద్వా ను కలవక ఆ పరిచయం మొదట స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమగా మారిందనే విషయాన్ని తెలియజేసింది. ఐదేళ్లపాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది. ఈ మధ్య తెలుగులో నటించిన సినిమా లేవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ నటిస్తున్న షణ్ముఖ చిత్రంలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో నైనా తన కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: