
కత్రినా కైఫ్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు "త్వరలోనే ఒక కొత్త అధ్యాయం నా జీవితంలో ప్రారంభం కానుంది అత్యంత అందమైన దశకు స్వాగతం పలుకుతున్నాం" అంటూ రాసుకు వచ్చారు విక్కీ, కత్రినా. ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు, సినీ సెలెబ్రెటీలు సైతం ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వివాహమైన నాలుగేళ్లకు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.
కత్రినా కైఫ్ విషయానికి వస్తే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ తెలుగు, మలయాళం, తమిళం వంటి భాషలలో కూడా నటించింది. మల్లేశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోయిన్గా పేరు సంపాదించింది. విక్కీ కౌశల్ విషయానికి వస్తే.. బయోపిక్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఈ ఏడాది ఛావా సినిమాలో అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం కూడా పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు తెలుస్తోంది విక్కి కౌశల్.