పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్‌, అడ్వాన్స్ బుకింగ్‌లు చూస్తుంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక పండుగ అని అర్థమవుతుంది. ప్రీమియర్ షోల కోసం హైదరాబాద్‌లోనే కాకుండా విదేశాల్లోనూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అమెరికాలో ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లలో రికార్డులు బద్దలు కొట్టే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది.

హైదరాబాద్‌లో ప్రీమియర్ షోల కోసం ఏకంగా 93 షోలు ఏర్పాటు చేయగా, వాటి ద్వారా ఇప్పటికే రూ. 3.5 కోట్ల వసూళ్లు నమోదైనట్టు సమాచారం. కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరులో కూడా ఓజీకి విశేష స్పందన లభిస్తోంది. అక్కడి ప్రీమియర్ షోల ద్వారానే రూ. 90 లక్షలకు పైగా వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


ఓజీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్, సుజీత్ టేకింగ్, తమన్ సంగీతం, ఇమ్రాన్ హష్మీ విలనిజం.. అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఇవ్వనున్నాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సినిమాకు ఇండస్ట్రీ హిట్ టాక్ వస్తే మాత్రం, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టే అవుతుంది. ఓజీ సినిమా తొలి రోజు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ చిత్రం అంచనాలకు మించి దూసుకెళ్తోంది. ప్రీమియర్ షోల బుకింగ్స్‌లో ఈ సినిమా అద్భుతమైన స్పందన పొందింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని దాదాపు అన్ని థియేటర్లలో ప్రీమియర్ షోల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి, దాదాపుగా అన్నీ నిండిపోయాయి. ఇది చిత్రానికి ఉన్న క్రేజ్‌ని స్పష్టంగా తెలియజేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: