పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా రేపటి రోజున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించగా, ఇమ్రాన్ హస్మి విలన్, ప్రియాంక మోహన్ హీరోయిన్ ,ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రాత్రి ప్రీమియర్ షోలో పడబోతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికాలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా షోస్ క్యాన్సిల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు.


సాధారణంగా ఇక్కడ ఐమాక్స్ థియేటర్లు ఎలా ఉంటాయో అమెరికాలో కూడా సినిమాల ప్రదర్శనకు సంబంధించి అలాంటి సంస్థలు ఉంటాయి, వారితో ఒప్పందం కుదుర్చుకొని మరి సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. నార్త్ అమెరికాలో ఓజి సినిమా షో లన్ని తాజాగా క్యాన్సిల్ చేశారు. ఓజి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీగానే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 2.11 మిలియన్ డాలర్లు (17.5 కోట్లు) రాబట్టింది. అయితే ఈ ఫిగర్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఓజి సినిమా కంటెంట్ పంపిణీ విషయంలో ఆలస్యమైనందువలన AMC వంటి పెద్ద థియేటర్స్ షోలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని YORK సంస్థ తెలియజేసింది.


అమెరికాలో చైన్ షోలు థియేటర్లలో ప్రదర్శించాలి అంటే విడుదలకు కొన్ని రోజులు ముందుగానే కంటెంట్ ను అందించాల్సి ఉన్నదట. కానీ ఓజీ సినిమా ఫస్ట్ ఆఫ్ కంటెంట్ చాలా ఆలస్యంగా రావడంతోపాటుగా సెకండ్ హాఫ్ ఇంకా రాలేదు.. దీంతో ఈ సినిమా అమెరికాలో $80,000 , కెనడాలో$160,000 ఆదాయం వరకు నష్టపోయినట్లు వినిపిస్తున్నాయి. దీనివల్లే అక్కడ షోలు రద్దు చేయడం జరిగిందట. ఈ విషయం విన్న అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనిబట్టి చూస్తే ఓజి సినిమా కేవలం తెలుగు, హిందీ భాషలలో మాత్రమే రిలీజ్ కాబోతోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: