ప్రస్తుతం వర్షాకాలం కారణంగా దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనివల్ల ప్రజలు కూడా జ్వరాల బారిన పడే అవకాశం ఉంటుంది. దోమల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైన సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే మనం మన ఇంటి పరిసరాలలో పెంచుకొనే మొక్కల వల్ల దోమలు రాకుండా చేస్తాయట. ఆ మొక్కల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.


అందులో మొదటిది వేప.. పూర్వపు రోజుల్లో  దోమలు క్రిమి కీటకాలను తరిమి వేయడానికి ఇంట్లో లేదా బయట వేప ఆకుల పొగ వేసేవారు. కొన్ని సందర్భాలలో వేపకు నూనేను కూడా ఉపయోగించడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. అందుకే ఇంటి పరిసరాలలో వేప మొక్క ఉంచడం మంచిది.


చాలామంది ఇళ్లల్లో తులసి మొక్క ఉండనే ఉంటుంది ఈ మొక్క నుంచి సేకరించిన గింజలను కూడా మన ఇంటి పరిసరాలలో చల్లితే ఈ మొక్కలు గుంపుగా మారుతాయి. ఈ తులసి మొక్కల నుంచి వచ్చే గాలి తలనొప్పి, గొంతు నొప్పి, జలుబుతో  ఇబ్బంది పడడమే కాకుండా దోమలు రాకుండా చేస్తుంది.



మరొక మొక్క క్యాట్నిప్, పుదీనా ఆకులను పోలివుంటే ఈ మొక్క అటు ఎండలో నీడలో కూడా బాగా పెరుగుతుంది. ఈ మొక్క ఇంటి పరిసరాలలో పెంచుకుంటే దోమల నుండి మాత్రమే కాకుండా ఇతర కీటకాలు కూడా ఇంటి దరికి చేరవు.

మరొకటి నిమ్మగడ్డి.. ఇది దోమలను తరిగి కొట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మగడ్డి నూనెను దోమల నివారణ వాటిలో ఉపయోగిస్తారట. ముఖ్యంగా డెంగ్యూ ని వ్యాప్తి చెందే దోమలను ఈ మొక్క చంపగలదు.

మరొకటి బంతిపూల మొక్క.. ఈ పూలు ఉపయోగమే కాదు ఈ మొక్క కూడా పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. ఈ మొక్క నుంచి వచ్చే రసాయన దోమలను తరిమికొట్టేలా చేస్తుంది. దోమలకు, ఈగలకు ఈ మొక్క నుంచి వచ్చే వాసన అలర్జీగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: