టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ అదిరిపోయే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని చాలా కాలమే అవుతుంది. ఈయన నటించిన సినిమాలు చాలానే ఈ మధ్య కాలంలో విడుదల అయిన ఏ సినిమా కూడా భారీ కలక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయలేదు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ "ఓజి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పై మొదటి నుండి కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తూ బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఇకపోతే కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ఓ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను ఈ మూవీ బృందం చాలా కాలం క్రితమే అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

దానితో ఈ సినిమాను ఓవర్ సిస్ లో కాస్త అటు ఇటుగా 17.5 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోని ఓవర్ సిస్ లో 20 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్లను వసులు చేసి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను ఓవర్ సిస్ లో కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ఓవర్ సిస్ లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకోవడంతో ఈ మూవీ ద్వారా ఓవర్ సిస్ డిస్ట్రిబ్యూటర్లకు అద్భుతమైన లాభాలు దక్కుతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: