ముంబై ఔట‌ర్ ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్త‌రిస్తోంది. ఇందులో ముఖ్యంగా సినీ తార‌ల పెట్టుబ‌డులు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు సంపాదిస్తున్న బాలీవుడ్ స్టార్లు తమ సంపాదనలో గణనీయమైన మొత్తాన్ని రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ల‌లో పెట్టుబడి పెడుతున్నారు. అలాంటి వారిలో అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్, సోనాక్షి సిన్హా, సోనమ్ క‌పూర్, శ్రద్ధా క‌పూర్ లాంటి స్టార్లు ఇప్పటికే రియ‌ల్ ఎస్టేట్‌లో విశేష పెట్టుబడులు పెట్టిన‌వారే. ఇప్పుడు అదే బాటలో యువ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా అడుగులు వేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు.


ఇటీవలే కార్తీక్ ముంబై అలీబాగ్‌లో 2,000 చదరపు అడుగుల స్థలాన్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ వార్తలు వచ్చిన 20 రోజుల వ్యవధిలోనే మళ్లీ ఓ భారీ రియ‌ల్ ఎస్టేట్ డీల్ ఫైనలైందని తెలుస్తోంది. ముంబై అంధేరి వెస్ట్‌లో ఉన్న సిగ్నేచర్ బై లోటస్ భవనంలో కార్తీక్ రూ. 13 కోట్ల విలువైన ఆఫీస్ స్పేస్‌ను కొనుగోలు చేశాడు. ఈ కార్యాలయం 1,905 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో, మొత్తం 2,095 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అదనంగా మూడు పార్కింగ్ స్లాట్లు కూడా రిజిస్టర్ అయ్యాయి. సెప్టెంబర్ 2025లో ఈ లావాదేవీ పూర్తి కాగా, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌కి కూడా కార్తీక్ భారీ మొత్తం చెల్లించిన‌ట్టు స‌మాచారం.


అంధేరి వెస్ట్ ప్రాంతానికి రోడ్డు, రైలు, విమానయాన కనెక్టివిటీ అద్భుతంగా ఉండటం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. అలీబాగ్‌లో ప్లాట్ కొనుగోలు చేసిన వెంటనే ఇంత పెద్ద ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేయడం సినీ వర్గాల్లో, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: