
సాధారణంగా రాజమౌళితో సినిమా చేసే అవకాశం దొరికితే ఏ స్టార్ హీరో అయినా ఆకాశాన్నంటే ఆనందపడతారు. కానీ అదే సమయంలో ఆయన వర్క్ స్టైల్ వల్ల అసహనం కూడా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రాజమౌళి టైం టేకింగ్ ప్రాసెస్‌కి ప్రసిద్ధి. ఒక సీన్‌కి కావలసిన ఎక్స్ప్రెషన్స్ రావడం లేదని అనిపిస్తే, ఆయన ఆ సీన్‌ను పదే పదే రిపీట్ చేయిస్తారు. ఒకసారి కాదు, వందసార్లు అయినా అదే సీన్‌ను మళ్లీ మళ్లీ చేయించడానికి వెనుకాడరు. కానీ చివరికి ఆయన విజన్ స్క్రీన్‌పై కనిపించేటప్పుడు ఆ కష్టాలన్నీ వృధా కాలేదని అనిపిస్తుంది.
ఇక మహేష్ బాబు సినిమాకు వస్తే, రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌లో మరింత పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నారట. కేవలం లుక్స్ విషయంలోనే మహేష్ బాబును దాదాపు సంవత్సరం పాటు వర్కౌట్స్ చేయించారని, ఇప్పుడు కొన్ని షాట్స్ సరిగ్గా లేవని మళ్లీ మళ్లీ అదే సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. దీంతో మహేష్ బాబుకి కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అయితే ఇక్కడ అభిమానుల కోపం ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. రాజమౌళి గారు సినిమాకు సంబంధించిన చిన్న క్లూ, చిన్న వీడియో అయినా రిలీజ్ చేయకపోవడం ఫ్యాన్స్‌కి చాలా నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు బర్త్‌డే రోజు కూడా కనీసం ఒక వీడియో కానీ, ఒక గ్లింప్స్ కానీ ఇవ్వకపోవడం అభిమానులకు నిజంగా ఫుల్ డిసప్పాయింట్‌మెంట్ ఇచ్చింది.
ఇతర పెద్ద సినిమాలన్నీ తమ తమ లేటెస్ట్ అప్డేట్స్‌ని బయటకు వదులుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" సూపర్ హిట్ కొట్టింది, ప్రభాస్ నటించిన "రాజా సాబ్" ట్రైలర్ కూడా విడుదలైంది, అట్లీ-బన్నీ సినిమా పై కూడా ఏదో ఒకటైనా వార్త వినిపిస్తూనే ఉంది. కానీ రాజమౌళి – మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం ఒక్క అప్‌డేట్ కూడా రాకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతూ "మెంటల్ తెప్పిస్తున్నాడు రాజమౌళి", "ఏంటి సినిమా గురించి అప్డేట్ ఇవ్వట్లేదు?", "ఇకనైనా మారండి రాజమౌళి గారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల కోపం ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఏమిటంటే, వారు తమ స్టార్ హీరో సినిమాపై గర్వంగా, హంగామాగా ఫీల్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారికి ఇబ్బందిగా అనిపిస్తోంది.
మొత్తానికి, రాజమౌళి గారి పర్ఫెక్షన్‌కి ప్రపంచమే ఫిదా అవుతుందనడంలో సందేహం లేదు. కానీ అదే పర్ఫెక్షన్ కారణంగా అభిమానులు ఎక్కువకాలం అప్డేట్స్ కోసం లాక్ అవ్వడం సహజంగానే ఆవేశం తెప్పిస్తోంది. ఇకనైనా రాజమౌళి అభిమానుల ఈ భావాలను అర్థం చేసుకొని, చిన్న గానీ పెద్ద గానీ ఒక అప్‌డేట్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ మళ్లీ ఉత్సాహంగా సినిమా కోసం ఎదురుచూడగలరు. చూదాం ఏం జరుగుతుందో..??