టాలీవుడ్‌లో ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ మధ్య రైవల్రీ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంది. స్క్రీన్‌పైనే కాకుండా రాజకీయ వేదికలపై కూడా వీరిద్దరి మాటల యుద్ధం తరచూ చర్చనీయాంశం అవుతోంది. తాజాగా బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత మసాలా జోడించాయి. మెగా – నందమూరి అభిమానుల మధ్య మంటలు రగులుతుండగా, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోలిక వైరల్ అవుతోంది. అదేమిటంటే.. వీరిద్దరి సినిమాల్లో నటించిన హీరోయిన్ల సెంటిమెంట్. 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన సిమ్రాన్, బాలయ్యతో చేసిన ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. బాలయ్య కెరీర్‌లో కొత్త రికార్డులు సృష్టించాయి. కానీ అదే సిమ్రాన్ చిరంజీవితో చేసిన ‘డాడీ’, ‘మృగరాజు’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ముఖ్యంగా 2001 సంక్రాంతికి రిలీజ్ అయిన మృగరాజు – నరసింహ నాయుడు క్లాష్ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిందే.

రెండింటిలోనూ హీరోయిన్ సిమ్రాన్ నే. బాలయ్య సినిమా సెన్సేషనల్ హిట్ అయితే, చిరు సినిమా తీవ్ర నిరాశపరిచింది. సోనాలి బింద్రే కూడా ఇలాంటిదే. చిరంజీవితో చేసిన ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇంద్ర అయితే ఇండస్ట్రీ హిట్. కానీ అదే సోనాలి బింద్రే బాలయ్యతో చేసిన ‘పలనాటి బ్రహ్మనాయుడు’ మాత్రం ఘోర ఫ్లాప్ అయింది. ఆ మూవీకి అదనంగా ఇంద్రలో చిరంజీవితో నటించిన ఆర్తి అగర్వాల్ కూడా జోడీగా ఉన్నా, ఫలితం మాత్రం నిరాశే. శ్రీయ శరన్ విషయానికి వస్తే.. చిరంజీవితో చేసిన ‘ఠాగూర్’ ఘనవిజయం సాధించింది. కానీ బాలయ్యతో చేసిన ‘చెన్నకేశవరెడ్డి’, ‘పైసా వసూల్’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆశించినంతగా నిలవలేదు. ప్రత్యేకంగా శాతకర్ణి చారిత్రక చిత్రమని హైప్ ఉన్నా.. చివరికి కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది.

ఈ పోలికలన్నీ చూస్తే .. ఒక హీరోయిన్ చిరంజీవితో చేస్తే హిట్, అదే హీరోయిన్ బాలయ్యతో చేస్తే ఫ్లాప్ అన్నట్టుగా ఒక సెంటిమెంట్ కొనసాగుతున్నట్టు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ యాదృచ్ఛికాలు అయినా.. మెగా – నందమూరి ఫ్యాన్స్ మాత్రం వీటిని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ హీట్ పెంచుతున్నారు. మొత్తానికి, చిరంజీవిబాలయ్య రైవల్రీ కేవలం బాక్సాఫీస్ క్లాష్‌లకే పరిమితం కాకుండా, హీరోయిన్ల సెంటిమెంట్లకూ విస్తరించడం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. మరి ఈ పోలికలు నిజంగానే సెంటిమెంట్ అనాలా? లేక కేవలం యాదృచ్ఛికాలా? అనేది ప్రేక్షకుల అభిప్రాయం మీదే ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: