
ప్రస్తుతం పాప పుట్టి రెండేళ్లు కావస్తూన్నప్పటికీ మెగా అభిమానులు కూడా క్లీంకారా ఫేస్ చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఇటీవల కాలంలో తరుచు ఉపాసన తాము రెండో బిడ్డ కనేందుకు కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన,రామ్ చరణ్ తో ఒక వేడుకకు హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో రామ్ చరణ్ చెయ్యి పట్టుకొని మరి ఉపాసన మెల్లగా కిందికి దిగుతూ వస్తున్నట్లు కనిపించింది.
ముఖ్యంగా తన చున్నీ మొత్తం కడుపు కనిపించకుండా కవర్ చేసుకున్న ఉపాసనను చూస్తే ప్రెగ్నెంట్ అనే వార్తలు జోరుఅందుకునేలా చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా ఈ జంటకు కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ కాబట్టి రామ్ చరణ్ అలా చేయి పట్టుకొని చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నారు అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం పైన అటు ఉపాసన కానీ రామ్ చరణ్ కానీ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్లో రాబోతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.