పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఓజి సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్లు లభించాయి. ఇక ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను లాంగ్ రన్ లో కూడా వసూలు చేస్తుంది అని చాలా మంది భావించారు. జనాలు భావించిన విధంగానే ఈ మూవీ కి మంచు కలెక్షన్లు ప్రస్తుతం దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఏడు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి.

కానీ విడుదల అయిన ఏడవ రోజు మాత్రం ఈ సినిమా తన అభిమాని అయినటువంటి నితిన్ సినిమా కలెక్షన్లను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాటలేకపోయింది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా సమంత , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అఆ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన ఏడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.73 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమా విడుదల అయిన ఏడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.71 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీనితో ఈ సినిమా నితిన్ హీరోగా రూపొందిన అఆ మూవీ తో పోలిస్తే తక్కువ కలెక్షన్లను ఏడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఇకపోతే పవన్ హీరోగా రూపొందిన ఓజి మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: