
టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 5.57 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 2.93 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.82 కోట్లు , ఈస్ట్ లో 1.42 కోట్లు , వెస్ట్ లో 93 లక్షలు , గుంటూరు లో 98 లక్షలు , కృష్ణ లో 1.05 కోట్లు , నెల్లూరు లో 77 లక్షలు మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 15.47 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సిస్ లలో కలుపుకొని ఈ మూవీ కి 3.12 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 18.59 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18.59 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ సినిమాకు 13.59 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.