టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... అర్జున్ దాస్ , శ్రేయ రెడ్డి , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు.

డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గ్యాంగ్ స్టార్ మూవీ కావడంతో ఓజి సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఓ రికార్డును సొంతం చేసుకుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.

సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ఏ తెలుగు సినిమా కూడా ఆ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేదు. ఇక దాదాపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఎనిమిది నెలలకు విడుదల అయిన ఓజి సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా టోటల్ కలెక్షన్లను క్రాస్ చేసి కొత్త రికార్డును సృష్టించింది. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో మరెన్ని కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: