సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . కూలీ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ నటనకు తాత్కాలిక విరామం ప్రకటించి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించడం . ఇక తాజాగా రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి హిమాలయాల పర్యటనకు బయలుదేరడం జరిగింది . ఈ యాత్రలో భాగంగా ఆయన సామాన్య జీవితాన్ని ఆస్వాదిస్తున్న పలు ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సోమవారం అనగా నిన్న ఉదయం ఆయన శ్రీ బద్రీనాథ్ ధామ్ నువ్వు దర్శించుకోవడం జరిగింది .


బద్రీనాథ్ ధామ్ కు చేరుకున్న రజినీకాంత్ అక్కడ బద్రి విశాల్ స్వామిని దర్శించుకున్నారు . శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ దేవస్థానం కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పవిత్ర ప్రసాదాన్ని అందజేయడం జరిగింది . ఇక రజనీకాంత్ ప్రతి సంవత్సరం ఉత్తరకాండలోని పుణ్యక్షేత్రాలను సంప్రదించడం ఆనవాయితీగా వస్తూ ఉంది . బద్రీనాథ్ కంటే ముందు రజినీకాంత్ రిషికేష్లో సాధారణ జీవితాన్ని గడుపుతున్న కొన్ని ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వీటిని చూసిన అభిమానులు పేరుకే సూపర్ స్టార్ కానీ ఇంత సింప్లిసిటీ గా ఉండడం ఒక రజనీకాంత్ వల్లే అవుతుంది .. అంటూ కామెంట్స్ చేస్తున్నారు .


ఆ ఫోటోలలో సూపర్ స్టార్ తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన నిలబడి ప్లేట్లో సాధారణ ఆహారాన్ని తింటూ కనిపించారు. ఈ అత్యంత ఘటన విషయాన్ని చూసి అభిమానులు రజనీకాంత్ సింప్లిసిటీని ఆకాశానికి వెత్తేస్తున్నారు . ఈ పర్యటనలో రజనీకాంత్ చాలా సాధారణమైన దుస్తుల్లో కనిపిస్తున్నారు.  ఆయన తెల్లటి దోతి మరియు కుర్తి ధరించి మెడలోస్కార్ఫ్ వేసుకోవడం జరిగింది . సూపర్ స్టార్ ఈ స్టైల్ ని చూసిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: