పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో రూపొందిన తాజా చిత్రం ఓజి . ఈ మూవీ రిలీజ్ కి ముందు విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని మంచి అంచనాలను క్రియేట్ చేసింది . ఈ తరుణంలోనే సెప్టెంబర్ 25 వ తారీఖున రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది . అంతేకాకుండా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వింగ్ పలువురి ప్రశంసలు కూడా దక్కాయి .


ఇక రీసెంట్గా నేహా షటిల్ స్పెషల్ సాంగ్ కూడా యాడ్ చేయడంతో మరింత క్రేజ్ పెరిగింది ఈ మూవీకి . ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల ఎన్నో డేస్ కాకుండానే ఓటిటి రిలీజ్ పై షాకింగ్ న్యూస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అక్టోబర్ 23వ తారీకు నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్టీమింగ్ కాబోతుంది .. అని వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది .


ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ మరియు ప్రకాష్ రాజ్, శ్రేయ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది . ప్రెసెంట్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుందని చెప్పుకోవచ్చు . ఇక ఈ మూవీలో సుజిత్ డైరెక్షన్ ఒక ఎత్తు అయితే తమన్ మ్యూజిక్ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు . ఈ మూవీ లో తమన్ కొట్టిన మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు . ఈ మ్యూజిక్ వలన కూడా సినిమా హైలైట్ గా నిలిచింది .

మరింత సమాచారం తెలుసుకోండి: