తెలుగు షోలలో మంచి ప్రసిద్ధి చెందిన షో బిగ్ బాస్ . అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈ రియాలిటీ షో . ఇక ప్రస్తుతం ఈ షో యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వివాదాస్పదంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు . ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం సేమ్ ఉన్న వాళ్ళను మరియు యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వారిని తీసుకోవడం జరిగింది . కానీ ఇప్పుడు చూడడానికి కూడా బాగుండడం లేదు . ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్న వాళ్ళనే తీసుకుంటుంది బిగ్ బాస్ .


అదే చూడడానికి చాలా చండాలంగా అనిపిస్తుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 9 లో చూసుకుంటే రీతు చౌదరి , సంజనా లాంటి వాళ్లపై ఎన్ని రకాల వివాదాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే . అయినప్పటికీ వాళ్ళను హౌస్ నుంచి పంపించకుండా అలానే ఉంచుతున్నారు యాజమాన్యం . ఇక ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అలేఖ్య చుట్టి పికిల్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదం అయినా రమ్య మోక్షను తీసుకుని సంచలనం సృష్టించారు . ఆమెకు తోడు దివ్వెల మాధురిని తీసుకోవడం మరో సంచలనం సృష్టిస్తుంది .


వీరిద్దరూ ఏ స్థాయిలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మనందరికీ తెలిసిందే . రమ్య మోక్ష అయినా వకింత పర్లేదేమో కానీ మాధురిని తేవడంపై తీవ్రమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి . ఆమె ఏపీ రాజకీయాలలో అతిపెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే . ఇప్పటికీ ఆమెను దువ్వాడ శ్రీనివాస్ భార్య మరియు కూతురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . అటువంటి ఆమెను హౌస్ లోకి తెచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రేక్షకులు మండిపడుతున్నారు . బిగ్బాస్ ను లక్షల మంది చూస్తున్నారు .. అలాంటి వారు పట్ల బిగ్ బాస్ మేనేజ్మెంట్ కు బాధ్యత లేదా .. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు .. హౌస్ లోకి ఎటువంటి వారిని పంపిస్తున్నారు .. అంటూ బిగ్ బాస్ పై తీవ్రంగా మండిపడుతున్నారు ప్రేక్షకులు .

మరింత సమాచారం తెలుసుకోండి: