పండుగ అంటే తెలుగు ప్రేక్షకులకు సినిమాలు అన్నమాటే. ప్రత్యేకంగా సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి సీజన్లలో సినిమా రిలీజ్‌లు పండగలా ఉంటాయి. ఈసారి కూడా దీపావళి దగ్గరపడుతుండటంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వేదికగా భారీ పోటీ నెలకొంది. మూడు రోజుల వ్యవధిలోనే నాలుగు సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో సినీ వర్గాల్లో హైప్ హద్దులు దాటుతోంది. గత ఏడాది దీపావళి సీజన్‌ను గుర్తు చేసుకుంటే, టాలీవుడ్‌లో ఒక అద్భుతమైన మ్యాజిక్ జరిగింది. పోటీలో ఉన్న మూడు సినిమాలూ హిట్టయ్యి బాక్సాఫీస్‌లో దుమ్ము దులిపాయి. కిరణ్ అబ్బవరం సినిమా “క” సూపర్ హిట్‌గా నిలిచింది. దుల్కర్ సల్మాన్ “లక్కీ భాస్కర్” మంచి రెస్పాన్స్ అందుకుంది.

తమిళ డబ్బింగ్ మూవీ “అమరన్” అనూహ్యంగా బ్లాక్‌బస్టర్ అయ్యింది. 2024 దీపావళి సీజన్ అత్యంత సక్సెస్‌ఫుల్ సీజన్‌గా నిలిచింది. ఇప్పుడు 2025లో కూడా అదే రిపీట్ అవుతుందేమో అన్న ఆసక్తి నెలకొంది. రేసులో ముందుగా దూసుకొస్తున్న సినిమా “మిత్రమండలి”. రిలీజ్‌కు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేయడం టీం కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం. ఇది జాతిరత్నాలు, మ్యాడ్ తరహాలో ఉన్న మ్యాడ్ ఫన్ కామెడీ ఎంటర్టైనర్‌. యువతలో క్రేజ్ పెరుగుతోంది. రెండవ స్లాట్‌లో ఉన్నది సిద్ధు జొన్నలగడ్డ సినిమా “తెలుసు కదా”. ట్రైలర్‌తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా కనిపిస్తోంది. రిలీజ్ హైప్ కాస్త తగ్గినా, కంటెంట్ మీద టీంకి నమ్మకం ఎక్కువగా ఉంది.

అక్టోబర్ 18న విడుదల కానున్న తమిళ డబ్బింగ్ మూవీ “డ్యూడ్” యూత్‌లో బోల్డ్ వైబ్స్‌తో బజ్ క్రియేట్ చేస్తోంది. స్యూర్ షాట్ హిట్ అని టీం గట్టిగా నమ్ముతోంది. చివరగా అక్టోబర్ 19న కిరణ్ అబ్బవరం “కే ర్యాంప్” వస్తోంది. ఫన్, మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన ట్రైలర్ ఇప్పటికే క్రేజీ బజ్ తెచ్చుకుంది. థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొనేలా ఉంది. అన్ని సినిమాలూ తమ తమ టార్గెట్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా కంటెంట్‌పై నమ్మకంతో బరిలోకి దిగుతున్నాయి. ఒకవేళ అన్ని సినిమాలకీ టాక్ బాగుంటే, ఈ దీపావళి సీజన్ 2024 మ్యాజిక్‌ను రిపీట్ చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌, యూత్‌,  కామెడీ లవర్స్ - అందరికీ ఏదో ఒక సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి బాక్సాఫీస్‌పై ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: