టాలీవుడ్లో యాంకర్, నటిగా పేరు సంపాదించింది అనసూయ. నిరంతరం సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే ఫోటోలు కూడా సంచలనంగా మారుతూ ఉంటాయి. అనసూయ కి వచ్చిన అవకాశాన్నల్లా గట్టిగానే ఉపయోగించుకొని పలు సినిమాలలో నటిస్తోంది. ఇటీవలే అనసూయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా అనసూయ పెళ్లికి ముందే ఒక బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేశానని, అతడినే వివాహం చేసుకున్న, తాను నమ్మిన వాళ్లని అసలు విడిచిపెట్టలేనంటూ తెలిపింది.



అందుకే భరద్వాజ్ కోసం ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి మరి వివాహం చేసుకున్నానని వెల్లడించింది అనసూయ. అలాగే తన కుటుంబ విషయాలను, పిల్లల విషయాలను పంచుకుంటూ తనకు ఇష్టమైన హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా?. ఆ వెంటనే రామ్ చరణ్ పేరు చెప్పింది అనసూయ. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఎందుకంటే రామ్ చరణ్ మహిళలను గౌరవించే విధానం తనకి బాగా నచ్చుతుందని తెలిపింది. మెగాస్టార్ కొడుకు అయ్యిండి కూడా కొంచెం కూడా గర్వం ఉండదంటూ అందరితో సరదాగా గడిపేస్తుంటారని తెలిపింది.అంతేకాకుండా రామ్ చరణ్ తో అవకాశం వస్తే మళ్ళీ మళ్ళీ నటించడానికి అయినా తాను సిద్ధంగానే ఉంటానని తెలియజేసింది.


ఒకవేళ తన లైఫ్లో బాయ్ ఫ్రెండ్ గా భరద్వాజ్ లేకపోతే రామ్ చరణ్ తో డేటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉండేదాన్నేమో అంటూ ఫన్నీగా తెలియజేసింది. తాజాగా అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అనసూయ ఇలాంటి కామెంట్స్ చేసింది. అనసూయ సినీ కెరియర్ విషయానికి వస్తే మొదట 2003లో నాగ సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టగా.. ఆ తర్వాత క్షణం, విన్నర్, యాత్ర, కథనం, పుష్ప, దర్జా, పుష్ప 2, రజాకర్ తదితర చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే చిత్రాలలో నటిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: