పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ప్రకాష్ రాజ్ , అర్జున్ దాస్ , శ్రేయ రెడ్డిమూవీ లో కీలకమైన పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను పోయిన నెల అనగా సెప్టెంబర్ 25 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.

మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే దాదాపు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. స్టార్ హీరోలు నటించిన సినిమాలు కనీసం విడుదల అయిన నెల తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎక్కువ శాతం ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా మాత్రం నెల తిరగకుండానే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్  సంస్థ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా ఈ సినిమాను అక్టోబర్ 23 వ తేదీ నుండి తెలుగు , హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ప్రకటించారు. దానితో పవన్ అభిమానులు ఓజి సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ మూవీ ని ఓ టీ టీ లో ప్రసారం అయ్యేలా మేకర్స్ డీల్ కుదుర్చుకొని ఉంటే బాగుండేది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: