ఇండియన్ సినీ హిస్టరీలో పాన్ ఇండియా సినిమాని మొట్టమొదటగా చేసిన హీరో ఎవరయ్యా అంటే ప్రభాస్ పేరు మాత్రమే గుర్తుకొస్తుంది. బాహుబలి సినిమాతో ఈయన పాన్ ఇండియా ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. అంతేకాదు సీక్వెల్స్ ట్రెండ్ కూడా ప్రభాస్ తోనే స్టార్ట్ అయ్యాయి.అలా ప్రభాస్ నటించిన బాహుబలి 1,బాహుబలి 2 సీక్వెల్స్ తెరకెక్కడంతో అప్పటినుండి ఈ ట్రెండ్ కొనసాగుతోంది.అయితే అలాంటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ బర్త్డే ఈరోజు కావడంతో ఈయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ తాజాగా తన 46వ బర్త్డేని జరుపుకుంటున్నారు. ఇక 50 ఏళ్లు దగ్గర పడుతున్నా కూడా ప్రభాస్ ఇంకా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈరోజు ప్రభాస్ బర్త్ డే కావడంతో ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది.అదేంటంటే..ప్రభాస్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ డైరెక్టర్ ప్రభాస్ ని చూసి చాలా అవమానంగా మాట్లాడారట.

 మొదట్లో ప్రభాస్ సినిమా సెట్ లో ఏదైనా డైలాగ్ చెప్పమన్నా యాక్టింగ్ చేయమన్నా కాస్త సిగ్గుపడేవారట. అయితే ఇప్పటికి కూడా అలాగే సిగ్గుపడుతూ ఉంటారు. ముఖ్యంగా బేస్ వాయిస్ తో డైలాగ్స్ చెప్పడానికి కాస్త సిగ్గుపడతారు. అందుకే ఆయన కొన్ని షూటింగ్ సెట్స్ లో కంఫర్ట్ ఉన్న డైరెక్టర్ల దగ్గర పెదవులు కదిలిస్తాను అంతే.. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పుకుంటానులే అని అంటూ ఉంటారట.అయితే మొదట్లో ఈయన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కూడా యాక్షన్ సీన్స్,కామెడీ సీన్స్,రొమాంటిక్ సీన్స్ వంటివి చేసే సమయంలో కాస్త సిగ్గుపడేవారట. దాంతో ప్రభాస్ ని చూసిన ఓ డైరెక్టర్ అసలు వీడికేం యాక్టింగ్ వస్తుంది. యాక్టర్ అంటే అన్ని చేయగలగాలి. కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా ప్రతి ఒక్కటి చేయాలి.

కానీ వీడేం పీకుతాడు.. వీడిని మన సినిమాలో పెట్టుకోవడం మన కర్మ అంటూ ప్రభాస్ నొచ్చుకునేలా మాట్లాడారట. అయితే ఈ వ్యాఖ్యలు ప్రభాస్ చెవిన పడడంతో ప్రభాస్ మనసు కాస్త నోచ్చుకుందట.ఇక డైరెక్టర్ అన్న మాటలతో అప్పటినుండి ప్రభాస్ తన నట విశ్వరూపం ఏంటో చూపించి ఎవరైతే తనని అవమానించారో మళ్లీ అదే డైరెక్టర్ తో శభాష్ అనిపించుకున్నారట. అలా ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ వరల్డ్ లెవెల్ లో పాపులర్ అని చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్ కింగ్ గా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న ప్రభాస్ ఈరోజు అనగా అక్టోబర్ 23న తన 46వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇండియా హెరాల్డ్ తరుపున ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: