టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరి కొన్ని రోజులలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హీరోయిన్ శిరీష తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. గత ఏడాది ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇందుకు సంబంధించి పెళ్లి పనులు కూడా షూర్ అయినట్లుగా తెలుస్తోంది. నిన్నటి రోజున కాబోయే దంపతుల హల్దీ వేడుకలు కూడా చాలా ఘనంగానే జరిగాయి. ముఖ్యంగా ఆటల, పాటలతో చాలా ఉత్సాహంగా సాగిన ఈ వేడుకలకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారింది.


హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్ లో ఈ వేడుకలు జరిగినట్లుగా వినిపిస్తున్నాయి. ఈ వీడియోలు ఫోటోలు చూసిన పలువురు ప్రముఖులు , నెటిజన్ సైతం ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నారా రోహిత్, శిరీష వివాహ వేడుకలు మొత్తం 5 రోజుల పాటు చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలిసిందే. ఇప్పటికే హల్దీ వేడుక పూర్తి కాగా ఈ రోజున నారా రోహిత్ పెళ్ళికొడుకుగా ముస్తాబు కానున్నారు. అక్టోబర్ 28 న మెహంది 29 న సంగీత నైట్ నిర్వహించబోతున్నారు.



ఇక అక్టోబర్ 30 వ తేదీన రాత్రి 10:35 నిమిషాలకు నారా రోహిత్, శిరీష ఒక్కటి కాబోతున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కి ఇరువురు కుటుంబ సభ్యులతో పాటుగా ప్రముఖ రాజకీయవేతలు, సినీ సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 చిత్రంలో శిరీష లెళ్ల నటించగా అప్పటినుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారింది. అయితే గత ఏడాది పెద్దలు అనుమతితో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈనెల 30వ తేదీన వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ హల్దీ వేడుక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: