కొన్ని చిత్రాలు కొంతమంది హీరోలకు మాత్రమే సెట్ అవుతాయి. అలాంటి చిత్రాలకు సీక్వెల్ ప్రకటించినప్పుడు ఇతర హీరోల తీయడం అంటే అది చాలా కష్టం. అలా 2010లో భారీ అంచనాల మధ్య విడుదలై పర్వాలేదు అనిపించుకున్న చిత్రం యుగానికి ఒక్కడు. హీరో కార్తీ , డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రీమాసేన్, ఆండ్రియా , తదితర సెలబ్రిటీలు నటించారు. అయితే తమిళంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమాకి ప్రశంసలు రావడంతో డైరెక్టర్ రాఘవన్ ఈ సినిమా పై స్పందించారు.


ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఏం లాభం అంటూ ఆయన తెలియజేశారు. ఈ సినిమా విడుదలైన సమయంలో చాలానే నెగెటివిటీ రివ్యూలను చూసి తను చాలా బాధపడ్డానని, ఈ సినిమాకి పెట్టిన డబ్బు, సమయం అంతా కూడా వృధ అయ్యిందనిపించింది.. కానీ ఇప్పుడు ప్రేక్షకులు చూసి ఈ సినిమాని ఆదరిస్తున్న ఆ సమయంలో సంబరాలు జరగకపోవడం వల్ల సంతోషం పొందలేకపోతున్నానంటూ తెలియజేశారు.


యుగానికి ఒక్కడు 2 సినిమా ఎప్పుడు వస్తుంది? అని అడగగా.. ఈ సినిమా ప్రకటన చేయకుండా ఉండాల్సిందే ఎందుకంటే కార్తి లేకుండా అసలు సీక్వెల్ సాధ్యం కాదని తెలిపారు .ఈ సినిమాకి భారీ బడ్జెట్ కూడా అవసరమే, హీరో కనీసం ఏడాది పాటు తన కాల్ సీట్లను ఇస్తే కానీ ఈ సినిమా పూర్తి చేయడం సాధ్యం కాదంటూ తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ ఏ మాత్రం సమస్య కాదని, విఎఫ్ఎక్స్ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఏఐ యుగంలో మనం ఉన్నాము. ఈ సినిమాని తెరకెక్కించడం కూడా అంత సులువైనది కాదు కానీ దేనికైనా సమయం వస్తుంది. ఎప్పటికైనా ఈ సినిమాను చేసి తీరుతాను వదిలే ప్రసక్తి లేదంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: