సెప్టెంబర్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. వరుస హిట్లతో థియేటర్లు మళ్లీ కిక్కిరిసిపోయాయి. అక్టోబర్‌లో కూడా అదే ఊపు కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘ కాంతార 2 ’ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. దీపావళి సందర్భంగా వచ్చిన సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించడంతో బాక్సాఫీస్ మరింత కదిలిపోయింది. ఇప్పుడు ఇదే ఊపు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం అక్టోబర్ 31న రానున్న ‘బాహుబలి: ది ఎపిక్’. ఇది రీ - రిలీజ్ సినిమా అయినా హైప్ మాత్రం కొత్త సినిమాలకు ఏమాత్రం తక్కువ కాదు. రాజమౌళి రెండు భాగాలను కలిపి ఒకే సినిమా రూపంలో విడుదల చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ డిమాండ్ ఉంది. ప్రీబుకింగ్స్ ఇప్పటికే అదిరిపోయే స్థాయిలో ఉన్నాయి. ఓ రీ - రిలీజ్ సినిమాకి ఇంత క్రేజ్ రావడం అరుదైన విషయం. టికెట్ రేట్లు పెరిగినా, షోలు ఫుల్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా రూ.100 కోట్ల మార్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. 30 అర్థరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజంగా టాలీవుడ్‌లో పెద్ద ఈవెంట్‌గా మారబోతోంది.


ఇక అదే రోజు మరో చిత్రం కూడా బాక్సాఫీస్‌ను హీటెక్కించబోతోంది. ‘మాస్ జాతర’. రవితేజ 75వ సినిమా కావడంతో ఫ్యాన్స్‌కు ఇది సెలబ్రేషన్ టైమ్. మొదట ఈ సినిమా 31న రిలీజ్ కావాల్సి ఉన్నా, ఇప్పుడు ఆ రోజు ప్రీమియర్స్ మాత్రమే ఉంటాయి. నవంబర్ 1 నుంచి థియేటర్లలో రెగ్యులర్ షోలు మొదలవుతాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు టీజర్, పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా, ట్రైలర్‌పై భారీ ఆశలు ఉన్నాయి. అదే సినిమా ఓపెనింగ్స్‌ని నిర్ణయించే అంశమవుతుంది. అయితే ‘ బాహుబలి ఎపిక్ ’ ధాటిని తట్టుకోవడం ‘ మాస్ జాతర ’ కు కాస్త కష్టమే. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం ధైర్యంగా ఉన్నారు. “ మాది కొత్త సినిమా, వాళ్లది రీ-రిలీజ్ ” అన్న ధోరణిలోనే ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు బలంగా ఆడితే , అక్టోబర్ కూడా టాలీవుడ్‌కి మరో బంగారు నెలగా నిలుస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: