తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన లోకేష్ కనకరాజు నుంచి సినిమా వస్తోందంటే చాలు ఖచ్చితంగా తారా స్థాయిలో అంచనాలు ఉంటాయి.  ఇప్పటివరకు 6 చిత్రాలే తీసింది అయినప్పటికీ ఆయనకు తీసుకువచ్చిన క్రేజ్ మాత్రం స్టార్ హీరోల రేంజ్ లో ఉంది. అందుకే భాషతో సంబంధం లేకుండా లోకేష్ కనకరాజుతో చాలామంది హీరోలు పనిచేయడానికి మక్కువ చూపిస్తుంటారు. అయితే కేవలం ఆయన కెరియర్లో ఒకే ఒక్క సినిమా ఆయనని డైలమాలో పడేసేలా చేసిందని వినిపిస్తున్నాయి.ఆ చిత్రమే కూలి.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఈ చిత్రంలో నటించగా ఆగస్టు 14న విడుదల భారీ అంచనాల మధ్య విడుదలైన ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఈ సినిమా వల్ల డైరెక్టర్ లోకేష్ కనకరాజు పైన సోషల్ మీడియాలో చాలానే ట్రోలింగ్ జరిగింది. కూలి సినిమా రజనీకాంత్ వంటి హీరోకి సరిపోలేదని అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని రజినీకాంత్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికలో కామెంట్స్ చేస్తున్నారు.


సినిమా విడుదలైనప్పటికి రెండు నెలలు కావస్తువున్న ఈ ఇంపాక్ట్ మాత్రం పోనట్టుగా కనిపిస్తోంది. తాను చేయబోయే తదుపరి చిత్రం పైన ఏ విధమైనటువంటి క్లారిటీ మాత్రం ఇంకా రావడం లేదు. కొంతకాలం క్రితం రజినీకాంత్ ,కమలహాసన్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారనే న్యూస్ వినిపించింది. అలాగే ఖైదీ 2 చిత్రాన్ని కార్తీతో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారనే విధంగా వినిపించాయి. అయితే తాజాగా ఖైదీ2 క్యాన్సిల్ అయ్యిందనే విధంగా వినిపిస్తోంది. కూలి సినిమా రిలీజ్ ముందు ఖైదీ 2 సినిమా అనౌన్స్మెంట్ చెసి బడ్జెట్ కూడా ఓకే చెప్పడంతో  లోకేష్ కనకరాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కూలి సినిమా తర్వాత పరిస్థితులు తారు మారయ్యాయని నిర్మాతలు బడ్జెట్ విషయంలో మార్పులు కోరినట్లుగా తెలిసింది.అయితే ఈ విషయంపై లోకేష్ కనకరాజు అంగీకరిస్తారా? లేదా అనే విషయంపై తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: