టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సూర్య దేగర నాగ వంశీ , సౌజన్య ఈ మూవీ ని నిర్మించగా .. బీన్స్ సీసీరిలీయో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ రోజు అనగా అక్టోబర్ 31 వ తేదీన ప్రదర్శించనున్నారు. ఈ మూవీ రేపు అనగా నవంబర్ 1 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు , రైట్ టైం ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే  2 గంటల 24 నిమిషాల 51 సెకండ్ల నిడివితో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మరి ఎక్కువ కాదు ... మరి తక్కువ కానీ రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దానితో రవితేజ ఈ సినిమాను చాలా సేఫ్ రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కొంత కాలం క్రితం రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆ సినిమా రంగ్ టైం ను చాలా వరకు తగ్గించారు. ఇలా మాస్ జాతర మూవీ ముందే తక్కువ అని టైం తో వస్తూ ఉండడంతో రవితేజమూవీ రన్ టైం విషయంలో మంచి జాగ్రత్త తీసుకున్నట్లు ఉన్నాడు అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt