సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది మాత్రమే అడిగెట్టిన ప్రతి ఇండస్ట్రీ లో కూడా మంచి విజయాలను అందుకుంటూ ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ గుర్తింపును , క్రేజ్ ను సంపాదించుకుంటారు. ఇక ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న చాలా సినిమా ఇండస్ట్రీ మూవీలలో నటించి దాదాపు నటించిన అన్ని ఇండస్ట్రీ లలో కూడా మంచి విజయాలను , మంచి గుర్తింపును దక్కించుకున్న అతి కొద్ది మంది ముద్దుగుమ్మలలో రష్మిక మందన ఒకరు. ఈమె కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె కన్నడలో కిరాక్ పార్టీ అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకొని అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ను దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె కన్నడ సినిమాలో నటించకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు పోకస్ పెట్టింది.

అందులో భాగంగా ఈమె ఛలో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని , మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఈమె తెలుగులో అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని అత్యంత తక్కువ కాలంలో తెలుగు సినీ పరిశ్రమంలో స్టార్ హీరోయిన్ స్థానానికి చేరుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటికి కూడా అదే రేంజ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈమె తెలుగు తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టి అక్కడ కూడా పలు సినిమాలలో నటించి కొన్ని విజయాలను అందుకొని తమిళ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె హిందీ సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు హిందీ సినిమాలలో కూడా నటించింది. కొంత కాలం క్రితం ఈమె చావా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దానితో ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇలా రష్మిక నటించిన ప్రతి ఇండస్ట్రీ లో కూడా మంచి విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm