దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా, ప్రభాస్–నయనతార జోడీ మాత్రం అప్పట్లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. స్క్రీన్‌పై వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలయ్యకు తల్లిగా నయనతార: అదే నయనతార 2010లో విడుదలైన సింహా సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ డ్యూయెల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో, ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నయనతార ఆయన భార్యగా కనిపించింది. అదే సినిమాలో బాలయ్య రెండో పాత్రకు తల్లిగా నటించి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తూనే, తన నటనతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇలా ప్రభాస్‌కు ప్రేమికురాలిగా, బాలయ్యకు తల్లిగా నటించడం సినిమా అభిమానులకు ఇప్పటికీ ఆసక్తికర అంశంగానే నిలిచింది.
లేడీ సూపర్ స్టార్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదు: నయనతార కెరీర్ రెండు దశాబ్దాలకు పైగా సాగుతోంది. ఇప్పటికీ 40 ప్లస్ వయసులోనూ అదే గ్లామర్, అదే గ్రేస్‌తో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ - ఎక్కడైనా నయనతారకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడేమో మెగాస్టార్ తో: ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకర వర ప్రసాద్ సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో నయనతార పాత్ర కీలకంగా ఉండనుంది. ఇప్పటికే విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ చార్ట్ బస్టర్‌గా మారి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే కాకుండా, నయనతార చేతిలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వయసు పెరిగినా గ్లామర్ తగ్గలేదని, నటనలో మాయ తగ్గలేదని నిరూపిస్తూ ఈ లేడీ సూపర్ స్టార్ ఇంకా ఇండస్ట్రీలో వెలుగులు వెదజల్లుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి