విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ ని నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేసే విధంగా నాగ వంశీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య హీరో గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ని నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం విడుదల చేసే విధంగా నాగ వంశీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి